Akhil: ఆసక్తి పెంచుతున్న అఖిల్ కొత్త చిత్రం అప్డేట్ 6 d ago

'ఏజెంట్' భారీ ఫెయిల్యూర్ తర్వాత అక్కినేని అఖిల్ దాదాపు రెండేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న తాజా మూవీ 'అఖిల్-6'. ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రాబోతున్నట్లు ఇటీవల నిర్మాత నాగవంశీ ఎక్స్ లో వెల్లడించారు. ఇక ఈ పోస్టు "ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం లేదు" అనే క్యాప్షన్ జత చేశారు. అఖిల్ పుట్టిన రోజు కానుకగా ఏప్రిల్ 8వ తేదీన టైటిల్, గ్లింప్స్ రాబోతున్నాయి అని వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.